గాంధీభవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ

TG: హైదరాబాద్ గాంధీభవన్‌లో గురువారం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లురవి అధ్యక్షతన సమావేశమైంది. ఈ భేటీలో ఉమ్మడి వరంగల్ నేతల పంచాయితీపై కమిటీ తేల్చనుంది. ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు విన్న కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. గత వారం తనపై వచ్చిన ఆరోపణలపై లిఖిత పూర్వకంగా కొండా మురళీ సమాధానం ఇచ్చారు. మిగతా నేతలు కూడా కమిటీకి తమ వాదన వినిపించారు.

సంబంధిత పోస్ట్