TG: రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో జడ్పీ, మండల పరిషత్ ఛైర్మన్ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని హస్తం పార్టీ ఫోకస్ పెట్టింది. దీంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, సన్నబియ్యం, రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత కరెంట్, రూ.500లకే సిలిండర్ వంటి వాటిని ఇంటింటికీ ప్రచారం చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.