TG: బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారని BRS నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు. నిన్నటి నిర్ణయం తర్వాత ద్రోహంతో కూడిన కుట్ర కనిపిస్తోందని చెప్పారు. '20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసింది. గత అనుభవాలు, కోర్టుల నిర్ణయాలను గతంలోనే చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయడం లేదు' అని విమర్శించారు.