తెలంగాణలో 25 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేటలో 'కేసీఆర్ ఉచిత పోలీస్ కోచింగ్ క్యాంప్'ను ఆదివారం హరీష్ రావు ప్రారంభించారు. అధికారంలోకి రాకముందు 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక కేవలం 16 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని విమర్శించారు. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు, మహిళలకు 33 శాతం పోలీసు ఉద్యోగ రిజర్వేషన్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సాధించామని గుర్తు చేశారు.