కాంగ్రెస్‌ ప్రభుత్వం కరోనా కంటే డేంజర్‌: హరీశ్‌రావు

TG: ఎల్‌నినో వస్తోందని ఎప్పటి నుంచో హెచ్చరించినా, పరిస్థితిని ఎదుర్కొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ హయాంలో కరోనా వచ్చినా కరెంటు ఆగలేదని ఆయన అన్నారు. బొగ్గు లేదని తాను గతం నుంచే హెచ్చరిస్తున్నానని హరీశ్​ తెలిపారు. ఇప్పుడు కరెంటు ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే బొగ్గు లేదని సాకు చెబుతున్నారని విమర్శించారు. ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం కరోనా కంటే డేంజర్‌ అని ఆయన విమర్శించారు. వర్షాకాలంలోనూ రేవంత్‌రెడ్డికి కరెంట్‌ ఇవ్వడం చేతకావట్లేదని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕