కాంగ్రెస్ హామీలను గాలికొదిలేసింది: జగదీష్ రెడ్డి

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని, సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణను చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్లారని, సాధ్యం కాదన్న 24 గంటల విద్యుత్‌ను అన్ని రంగాలకు అందించారని అన్నారు. ఈ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తోందని ఆరోపించారు. అవినీతి సొమ్ముకు ఆశపడి ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు.  .

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕