బీసీలకు 42శాతం రిజర్వేషన్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న హడావిడి చూస్తుంటే బీసీలను మోసం చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ‘కాంగ్రెస్ ఎప్పుడూ ఇచ్చిన మాట మీద నిలబడలేదు. బీసీ రిజర్వేషన్లకు మతపరమైన అంశాన్ని జోడించారు. మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగం, సుప్రీం కోర్టు అంగీకరించవు. ఈ వ్యవహారంలో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి’ అని తెలిపారు.