తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎల్పీ సమావేశం ముగిసింది. సూర్యాపేటలో భారీ బహిరంగసభ పెట్టాలని సీఎల్పీ నేతలు ఈ సమావేశంలో నిర్ణయించారు. సూర్యాపేటలో నిర్వహించనున్న సభకు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఎస్సీ వర్గీకరణపై మెదక్‌లో సభ పెట్టాలని.. ఆ సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను ఆహ్వానించాలని నేతలు నిర్ణయించారు.