TG: మోసం, దగా, నయవంచనకు మరోపేరు కాంగ్రెస్ అని KTR మండిపడ్డారు. అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చిన రేవంత్ నమ్మకద్రోహానికి మరో ఉదాహరణ ఫార్మా సిటీ అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా ఫార్మా రైతులకు భూములను తిరిగి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎనుముల అన్నదమ్ముల కోసమే ఫార్మా భూముల్లో ఫ్యూచర్ సిటీ కడుతున్నారని ఆరోపించారు. ఫార్మా రైతుల భూములను తిరిగి ఇచ్చేవరకు BRS పోరాడుతుందన్నారు.