TG: జూరాల ఆయకట్టు కింద ఒక్క ఎకరం ఎండినా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి జూరాల, నాగార్జునసాగర్ కింద పంటలు ఎండిపోకుండా నీళ్లు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.