TG: రాష్ట్ర కాంగ్రెస్ గురువారం నుంచి జనహిత పాదయాత్రను నిర్వహించనుంది. ఈ పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొంటారు. ఆగస్టు 5, 6, 7 మూడురోజుల పాటు 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తారు. ఆగస్టు 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా, 7న రాష్ట్రపతికి వినతిపత్రం అందజేయనున్నారు. ఢిల్లీ టూర్ అనంతరం యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర కొనసాగనుంది.