మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని వరిగుంత వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి, సంగాయిపేట పెట్రోల్ బంక్ యజమాని అనిల్ మృతి చెందాడు. మెదక్ వైపు నుంచి రంగంపేట వైపు వస్తుండగా మార్గంమధ్యలో తాను ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. క్షతగాత్రుడిని మెదక్ క్రిటికల్ కేర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.