అమెరికాలో కారు ప్రమాదం.. కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ సతీమణికి గాయాలు

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి డాక్టర్ సుచి అమెరికాలో కారు ప్రమాదంలో గాయపడ్డారు. తమ కుమార్తె డాక్టర్ గగనను ఎండీ కోర్సులో చేర్పించి న్యూయార్క్ వెళ్తుండగా, వర్షం కారణంగా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డాక్టర్ సుచికి పక్కటెముకలు విరిగినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్