దిల్లీలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇండియా కూటమి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వారు ర్యాలీ చేపట్టారు. అయితే పోలీసులు ర్యాలీని మధ్యలోనే అడ్డుకుని నేతలను అదుపులోకి తీసుకున్నారు.