TG: మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ నేత మారెల్లి అనిల్(35) సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలు బంక్ నిర్వహిస్తున్న అనిల్.. గత రాత్రి మెదక్ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో జరిగిన ప్రమాదంలో అతడు తీవ్ర గాయాలతో మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలంలో 4 బుల్లెట్లను గుర్తించారు. దీంతో అతడిని కాల్చి చంపినట్లుగా అనుమానిస్తున్నారు.