TG: జనగామ RTC చౌరస్తాలో శనివారం కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ NSUI ఆధ్వర్యంలో ఇటీవల KTR చిత్రపటానికి ఉరి తీశారు. దానికి నిరసనగా BRS ఆధ్వర్యంలోశుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఉరి తీశారు. దీనికి నిరసనగా శనివారం NSUI జిల్లా అధ్యక్షుడు బోనాసి క్రాంతి ఆధ్వర్యంలో KTR ఫొటోను చెప్పులతో కొడుతూ చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు.