మెదక్ జిల్లా కౌడిపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా గద్దెను ఆదివారం అర్థరాత్రి కాంగ్రెస్ నేతలు కూల్చివేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.