TG: జూన్ 1 నుంచి గోదావరిలో 750 TMCలు, కృష్ణాలో 250 TMCల నీటిని ప్రభుత్వం దిగువకు విడుదల చేసిందని మంత్రి KTR విమర్శించారు. కన్నెపల్లి, దేవాదుల, పాలమూరు-రంగారెడ్డి, KLI పంపులను సక్రమంగా వినియోగించుకుంటే రిజర్వాయర్లు, చెరువులను నింపే అవకాశం ఉండేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను, పోతిరెడ్డిపాడు, వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణా నీళ్లను తరలించుకుపోయిందని KTR ఆరోపించారు.