పంటలకు మద్దతు ధర చట్టాన్ని తీసుకువచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ: ఆది శ్రీనివాస్

TG: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆలోచన చేసిందే కాంగ్రెస్‌ పార్టీ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ తెలిపారు. పంటలకు మద్దతు ధర చట్టాన్ని తీసుకువచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలన కాలంలో తరుగు పేరుతో రైతులను దోపిడీ చేశారని, ఏ రైతును కలవని కేసీఆర్‌కు తాము ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పిందెవరని ప్రశ్నించారు. సారు బయటికి రారని, ఎవరిని కలవరని స్వయంగా కేసీఆర్‌ కుమార్తె అన్నారని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్