కాంగ్రెస్ పార్టీకి దూరదృష్టి లేదు: ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలోవమర్శలు గుప్పించారు. ఆ పార్టీకి దూరదృష్టి, ఎటువంటి ప్రణాళిక లేదని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడి తీరుపైనా మండిపడ్డారు. తాను ప్రసంగిస్తున్న సమయంలో ఖర్గే సహా విపక్ష నేతలు నినాదాలు చేయడంతో ప్రధాని మోదీ ఈ విధంగా స్పందించారు. ప్రధాని ప్రసంగాన్ని వ్యతిరేకించిన విపక్ష సభ్యులు.. రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.

సంబంధిత పోస్ట్