TG: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో మాజీమంత్రి హరీశ్ రావు రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు. 'బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదని రేవంత్ రెడ్డి అంటున్నారు. అవును ప్రతిపక్ష హోదా రాదు.. పాలకపక్ష హోదా' వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని అన్నారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్‌నే కోరుకుంటున్నారని చెప్పారు.