కాంగ్రెస్ విధానాలు దేశానికి డేంజర్: ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు  గుప్పించారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధేమాజీ జిల్లాలోని గోగాముఖ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసం మతపరమైన హింస నిరోధక చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నించిందన్నారు. ఆ బిల్లు వివక్షపూరితమైనదని దుయ్యబట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ మళ్లీ అలాంటి చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించారని, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తుందని నిరూపిస్తోందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్