TG: పంచాయతీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది. రాష్ట్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ పర్యవేక్షించనుండగా, రెండో స్థాయిలో జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, మూడో స్థాయిలో డీసీసీ అధ్యక్షులు ఎన్నికల బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లా నేతలతో నిరంతరం ఆన్లైన్ సమావేశాలు నిర్వహించనున్నారు. అత్యధిక పంచాయతీలను గెలిపించే బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులపైనే ఉంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డీసీసీ అధ్యక్షులకు ఈ ఎన్నికలు ఒక సవాలుగా మారనున్నాయి.