TG: వికారాబాద్ జిల్లా పరిగిలో గణేష్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున మద్యం మత్తులో ఉన్న తరుణ్ అనే యువకుడు వీరంగం సృష్టించి, ఓ ట్రాక్టర్ తాళం చెవిని లాక్కున్నాడు. దీంతో అక్కడ గొడవ జరుగుతుండగా.. దానిని ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేయడంతో ఆయన కడుపు ఎడమ భాగంలో గాయపడ్డారుమైంది. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.