ఒకే కుటుంబంలో ముగ్గురికి కానిస్టేబుల్ ఉద్యోగాలు

AP: హోంమంత్రి అనిత శుక్రవారం పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు సత్తా చాటారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ దౌలా ముగ్గురు కుమారులు ఉద్యోగాలు సాధించారు. మహమ్మద్ అలీ, మహమ్మద్ గౌస్, మహమ్మద్ సమీర్ ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. ముగ్గురు సోదరులకు పోలీస్ ఉద్యోగాలు రావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్