వైద్యుల నిర్లక్ష్యంపై కానిస్టేబుల్ నిరసన.. డీఎంకే జెండా దహనం

చెన్నై సచివాలయం ఎదుట హెడ్ కానిస్టేబుల్ ఏ. కోదండపాణి తన కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగాడు. గురువారం, తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి సచివాలయానికి చేరుకున్న ఆయన, డీఎంకే పార్టీ జెండాను దహనం చేశాడు. 2021లో జరిగిన ఆపరేషన్ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమార్తె ఎడమ కాలును తొలగించాల్సి వచ్చిందని, మరో కాలు, ఎడమ చేయి కదలికలు కూడా దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. డీఎంకే జెండాను దహనం చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్