కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని.. కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఎస్‍టీఎఫ్ కానిస్టేబుల్‍గా పని చేస్తున్న లలితేష్ యాదవ్ కు భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే లలితేష్‌కి సరోజిని భరద్వాజ్(25) అనే మహిళతో ఎఫైర్ ఉంది. ఈ క్రమంలో లలితేష్‌ఇంట్లో లేని సమయంలో అతడి భార్య రీనాతో సరోజిని వాగ్వాదానికి దిగింది. ఆ తర్వాత రీనా, ఆమె ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో రీనాతో పాటు ఆమె తొమ్మిదేళ్ల మృతి చెందారు. ఇద్దరు కుమార్తెలు చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్