మహిళపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులు (వీడియో)

AP: ఏలూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కుక్కునూరు PSలో ఓ కానిస్టేబుల్ పై ఒక మహిళ తనను లైంగికంగా వేధిస్తున్నాడని, మాట వినకపోతే సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, నర్సరీ మొక్కలను ధ్వంసం చేశాడని ఆమె ఆరోపించింది. అయితే, తనను కులం పేరుతో తిట్టిందని కానిస్టేబుల్ కూడా కౌంటర్ ఫిర్యాదు చేశారు. ఇద్దరి ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్