స్వగ్రామానికి చేరిన కానిస్టేబుల్ సౌమ్య భౌతికకాయం(వీడియో)

TG: గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టడంతో గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ గాజుల సౌమ్య (23) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఎనిమిదిరోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె చివరకు చనిపోయారు. ఈ మేరకు కానిస్టేబుల్ సౌమ్య భౌతికకాయాన్ని ఆమె స్వగ్రామం నిజామాబాద్ జిల్లాలోని మోస్రాకు తీసుకొచ్చారు. కాగా ప్రభుత్వ లాంఛనాలతో సౌమ్య అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్