తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం వేగవంతం: సీఎం రేవంత్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖపై సమీక్ష నిర్వహించి, తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మిస్తే 100 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని నిపుణులు తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ముంపు ప్రభావంపై చర్చలు జరపాలని, అవసరమైతే పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమని సీఎం స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు వర్షాల కంటే ముందే పూర్తి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్