ముంబైలోని గురుగ్రామ్ సమీపంలో ఫ్లైఓవర్ పై నుంచి ఓ కంటైనర్ కింద పడింది. దీంతో వెంటనే కంటైనర్ నుంచి మంటలు వ్యాపించాయి. కొంతసేపటికే కంటైనర్ మొత్తం పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. అప్రమత్తమైన డ్రైవర్ అందులో నుంచి బయటకు పడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.