కాంట్రాక్టర్ దారుణం.. వ్యక్తిని చెట్టుకు కట్టేసిన ఘటన(వీడియో)

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సొనాల మండలం కోఠ గ్రామానికి చెందిన లోఖండే మారుతి భార్య పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణానికి సత్యనారాయణ అనే కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. లబ్ధిదారుని ఖాతాలో లక్ష రూపాయలు జమయ్యాయి. ఆ డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహించిన కాంట్రాక్టర్, లబ్ధిదారురాలి భర్త మారుతిని మండల కేంద్రంలో చెట్టుకు కట్టేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్