TG: హైదరాబాద్‌లోని షేక్‌పేటలో పాఠశాల సమీపంలో ఉన్న బీఫ్ షాప్‌ను బలవంతంగా మూసివేసి, సిబ్బందిని బెదిరించిన సంఘటనపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. సంపత్ ముదిరాజ్ అనే వ్యక్తి షాప్ సిబ్బందితో దుర్భాషలాడి, షట్టర్ మూసివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, స్కూళ్ల సమీపంలో మాంసం దుకాణాలపై నిషేధం లేదని, పాన్ షాపులపై మాత్రమే నిషేధం ఉందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై గోల్కొండ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.