సూర్య కొత్త సినిమా టైటిల్ పై భిన్నాభిప్రాయాలు

దశాబ్ద కాలంగా సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో సూర్య, 'కంగువ', 'రెట్రో' చిత్రాల తర్వాత ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'విశ్వనాధం అండ్ సన్స్' అనే టైటిల్ తో తెలుగులో నేరుగా సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలున్నాయి. అయితే, 'విశ్వనాధం అండ్ సన్స్' అనే టైటిల్ పై కొందరు బాగుందని అంటుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. గతంలో 'లక్కీ భాస్కర్' టైటిల్ పై కూడా ఇలాంటి స్పందన వచ్చిందని, కానీ ఆ చిత్రం విజయం సాధించిందని గుర్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్