అమెరికా-చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ (యూఎస్‌సీసీ) విడుదల చేసిన నివేదిక భారత్‌లో తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ నివేదిక ప్రకారం, భారత్-పాక్ మధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ సైనిక విజయం సాధించిందని, ఇది చైనా ఆయుధాల సామర్థ్యాన్ని పరీక్షించడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశంగా ఉపయోగపడిందని పేర్కొంది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని 'తిరుగుబాటు దాడి'గా అభివర్ణించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.