కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న కాపర్‌

బంగారం, వెండికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు రాగి ‘కొత్త బంగారం’గా మారుతోంది. ప్రపంచ మార్కెట్లో గత ఏడాది రాగి ధర సుమారు 50% పెరిగింది. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌లో టన్ను రాగి ధర రికార్డు స్థాయిలో 14,737 డాలర్లకు చేరింది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్, పవర్ గ్రిడ్లు, డేటా సెంటర్లలో డిమాండ్ పెరగడం, గనుల నుంచి సరఫరా తగ్గడం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. భవిష్యత్తులో రాగికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕