మారుతున్న జీవనశైలిలో ఎనర్జీ డ్రింక్స్ కు బదులుగా, పూర్వీకుల సాంప్రదాయ పానీయం 'రాగి గంజి' శరీరానికి తక్షణ శక్తిని అందించి, ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. రాత్రంతా నానబెట్టడం వల్ల కలిగే ప్రోబయోటిక్స్ ప్రేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తయారీ విధానం.. రాగి పిండిని నానబెట్టి, ఉడికించి, పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు కలిపి తీసుకోవాలి. మహిళల్లో కాల్షియం లోపం, డయాబెటిస్, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతో ప్రయోజనకరం. వేసవిలో కృత్రిమ పానీయాల కంటే రాగి గంజి ఉత్తమం.