ప్రస్తుతం బంగారం, వెండికి ప్రత్యామ్నాయంగా రాగి ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. ఏఐ డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, పవర్ గ్రిడ్ అప్‌గ్రేడ్‌లు రాగిపై ఆధారపడి పనిచేస్తున్నాయి. భారత ఆర్థిక సర్వే 2025-26 ప్రకారం, రాబోయే సంవత్సరాల్లో ప్రపంచం తీవ్రమైన రాగి కొరతను ఎదుర్కొనే అవకాశం ఉంది. పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులకు భారీ మౌలిక సదుపాయాలు అవసరం, దీనికి పెద్ద మొత్తంలో రాగి అవసరం.