దగ్గు నివారణకు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సిరప్ వేస్తూ ఉంటారు. అయితే ఈ సిరప్‌లలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు తాజాగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. దగ్గు సిరప్‌లు క్వాలిటీ టెస్టులో ఫెయిలయ్యాయని తెలిపింది. డైథలీన్ గ్లైకాల్, పీహెబ్, ఇథిలీ గ్లైకాల్ వంటివి సరైన పరిమితుల్లో లేవని చెప్పింది. మొత్తం 7,087 బ్యాచ్‌ల సిరప్‌లను టెస్ట్ చేయగా.. అందులో 353 బ్యాబ్‌లు పరీక్షలో ఫెయిల్ అయ్యాయని తెలిపింది.