చనిపోయిన జాబితాలో పేరు ఉందని శ్మశానవాటికలో నిరసన తెలిపిన కౌన్సిలర్

పశ్చిమ బెంగాల్‌లోని డాంకునీ మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ సూర్య దేవ్‌ పేరు ఓటరు జాబితాలో చనిపోయిన వారిగా చేర్చడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తన అంత్యక్రియలు శ్మశానవాటికలో నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్యూమరేషన్‌ ఫారమ్‌లో వివరాలు ఇచ్చినా పేరు తొలగించకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధికే ఈ పరిస్థితి ఎదురైతే, సాధారణ ఓటర్ల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. తాను జీవించి ఉన్నానని, దీనిపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్