మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా, పైఠాన్ తాలూకాలో దారుణం జరిగింది. సిమెంట్ ఉత్పత్తుల కంపెనీలో పని విషయంలో తలెత్తిన వివాదంతో ఒక కార్మికుడిపై కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో కార్మికుడి తలకు గాయమైంది. అతని భార్యపై కూడా నిందితులు దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు బిడ్కిన్ పోలీసులు ఐదుగురు అనుమానితులపై కేసు నమోదు చేశారు.