ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. పిప్రైచ్ నివాసి అయిన 21 ఏళ్ల విశ్వకర్మ కుమార్ స్థానిక యువతిని ప్రేమించాడు. అయితే తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదనే కారణంతో వీరిద్దరూ పిప్రైచ్ రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి చనిపోయారు. ఇద్దరూ ప్లాట్‌ఫాం మీద కూర్చుని చాలా సేపు మాట్లాడుకుని.. ట్రైన్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా ట్రాక్ పైకి దూకినట్లు సమాచారం.