అద్దె కట్టలేదని అవమానం.. దంపతుల ఆత్మహత్య

TG: హనుమకొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్నదానం చేసిన కేదారి, పుష్పలత దంపతులు అద్దె కట్టలేక, యజమాని అవమానాలతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల హోటల్‌కు తాళం వేసి, తీవ్రంగా దూషించడంతో దంపతులు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. భర్త కేదారి అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య పుష్పలత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. మృతుల కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు షాపు యజమాని, అతని కుమారుడిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕