ఇంటి అద్దె చెల్లించలేక ఓనర్ ని హత్య చేసిన దంపతులు

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అద్దె చెల్లించకుండా, అప్పు కూడా ఎగ్గొట్టేందుకు ఇంటి యజమాని విజయలక్ష్మిని రాము, సాలమ్మ దంపతులు గొంతు నులిమి హత్య చేశారు. నవంబర్ 26వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటనలో, విజయలక్ష్మి మృతదేహాన్ని వైటీ చెరువులో పడేశారు. అద్దె, అప్పుల ఒత్తిడితోనే ఈ హత్య జరిగినట్లు నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. విజయలక్ష్మి ఒంటిపై ఉన్న బంగారు నగలను కూడా దొంగిలించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్