దళపతి విజయ్ నటించిన `జన నాయగన్` సినిమా సెన్సార్ క్లియరెన్స్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడింది. తెలుగులో `భగవంత్ కేసరి` ఆధారంగా రీమేక్ అయిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ `ఓ రోమియో` కూడా కోర్టు కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో తన తండ్రిని విలన్‌గా చూపించారని, కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా కూతురు సనోబేర్ షేక్ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ రెండు చిత్రాల విడుదల ప్రశ్నార్థకంగా మారింది.