పెన్షన్ కోసం వెళ్తున్న‌ వృద్ధురాలిపై ఆవు దాడి (వీడియో)

AP: అనంతపురం జిల్లా కొనకొండ్లలో ఆవు బీభత్సం సృష్టించింది. పెన్షన్ కోసం సచివాలయం వెళ్తున్న నెట్టికంటమ్మ అనే వృద్ధురాలిపై మంగళవారం ఆవు దాడి చేసింది. దీంతో ఆమె తీవ్రగాయాలతో మృతి చెందింది. మరికొందరిపై దాడికి యత్నించిన ఆవును చూసి స్థానికులు పరుగులు తీశారు. అనంతరం ఆవు కూడా చాలా సేపు పరిగెత్తి, బాగా అలసిపోయి కిందపడి చనిపోయింది. ఇటీవల ఆ ఆవును పిచ్చి కుక్క కరిచిందని గ్రామస్తులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕