ఆవు నెయ్యి, గేదె నెయ్యి.. ఆరోగ్యానికి ఏది మేలు?

మార్కెట్లో లభించే ఆవు నెయ్యి, గేదె నెయ్యిలలో ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుందనే సందేహం చాలామందిలో ఉంటుంది. పోషకాహార నిపుణుల ప్రకారం, రెండింటిలోనూ ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆవు నెయ్యిలో బీటా-కెరోటిన్, విటమిన్-ఎ ఎక్కువగా ఉండి కంటి, చర్మ ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. ఇది త్వరగా అరిగిపోతుంది. గేదె నెయ్యిలో కొవ్వు, కెలరీలు ఎక్కువ. తక్కువ కెలరీల డైట్, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఆవు నెయ్యి, బరువు పెరగాలనుకునేవారు, తీవ్రమైన వ్యాయామం చేసేవారు గేదె నెయ్యి ఎంచుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕