చంద్రగ్రహణం రోజున రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఎం.తోటూరు గ్రామంలో మంగళవారం ఉదయం ఓ ఆవు రెండు తలల మగ దూడకు జన్మనిచ్చింది. పాడి రైతు కాళ్ళ.తులసిదాస్ వద్ద ఉన్న సిరి అనే ఆవు మొదటి కాన్పులో ఈ వింత దూడకు జన్మనిచ్చింది. డోలి పౌర్ణమి, చంద్ర గ్రహణం రోజున ఈ సంఘటన జరగడంతో, గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలు దీనిని దేవుని మహిమగా భావిస్తున్నారు. పౌర్ణమి రోజున మగ దూడ పుట్టడంతో, దీనిని దత్తాత్రేయ స్వామివారి ప్రతిరూపంగా భావిస్తూ, దూడకు దండాలు పెడుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు.

సంబంధిత పోస్ట్