హైదరాబాద్‌లో సామూహిక వినాయక నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నిమజ్జనాలు విజయవంతంగా పూర్తవడంతో, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద పోలీసులు సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా పోలీసు సిబ్బందితో కలిసి సీపీ సజ్జనార్ డ్యాన్స్ చేశారు. నిమజ్జన ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, సచివాలయం పరిసరాల్లో విధించిన ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో ట్యాంక్‌బండ్, లిబర్టీ, అసెంబ్లీ వైపు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.