ఆగస్టు 4 నుండి సీపీగెట్ పరీక్షలు

TG: రాష్ట్రంలోని యూనివర్శిటీల పరిధిలో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన సీపీగెట్ పరీక్షలు ఆగస్టు 4 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి శనివారం వెల్లడించారు. ఈ పరీక్షలు మొత్తం 45 సబ్జెక్టుల కోసం నిర్వహించబోతున్నామని, దరఖాస్తుల సమర్పణకు గడువు జులై 17 వరకు ఉండగా, రూ.500 ఆలస్య రుసుముతో జులై 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్